హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హింద్‌వేర్ బ్రాండ్‌తో శానిటరీ వేర్ తయారీలో ఉన్న హెచ్‌ఎస్‌ఐఎల్ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్ సమీపంలోని బీబీ నగర్‌తోపాటు హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శానిటరీ వేర్ తయారీ కేంద్రాలున్నాయి. మూడవ యూనిట్‌ను పోర్టు సమీపంలో నెలకొల్పుతామని హెచ్‌ఎస్‌ఐఎల్ సీఎండీ రాజేంద్ర కె సొమానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ నెలకొల్పేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ‘ప్రస్తుతమున్న ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించాల్సిందే. ఇందుకోసం సుమారు రూ.110 కోట్లు ఖర్చు చేస్తాం’ అని వివరించారు. ఈ ఏడాది విస్తరణ కోసం రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలియజేశారు.
మరో రూ.90 కోట్లతో..
పటాన్‌చెరు వద్ద నెలకొల్పిన ప్లాస్టిక్ పైప్స్, ఫిట్టింగ్స్ యూనిట్‌లో ఈ ఏడాది ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభమైంది. తొలిదశలో రూ.160 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2020 నాటికి మరో రూ.90 కోట్లు ఖర్చు చేస్తామని పైప్స్ విభాగం ప్రెసిడెంట్ రాజేశ్ పజ్నూ వెల్లడించారు. ‘రెండేళ్లలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30 వేల టన్నుల నుంచి 45 వేల టన్నులకు చేరుతుంది. ట్రూఫ్లో బ్రాండ్ ద్వారా 2018–19లో రూ.200 కోట్ల వ్యాపారం ఆశిస్తున్నాం. 2022 నాటికి టాప్–5 బ్రాండ్లలో ఒకటిగా నిలుపుతాం’ అని వివరించారు. కాగా, ఏప్రిల్–సెప్టెంబరు కాలంలో హెచ్‌ఎస్‌ఐఎల్ రూ.1,172 కోట్ల టర్నోవరుపై రూ.6.8 కోట్ల నికరలాభం ఆర్జించింది.
హెచ్‌ఎస్‌ఐఎల్ మరో ప్లాంటు
Published Fri, Nov 2 2018 1:04 AM | Last Updated on Fri, Nov 2 2018 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment