'జేమ్స్ బాండ్ 007 ఇమేజ్ అక్కర్లేదు'
'జేమ్స్ బాండ్ 007 ఇమేజ్ అక్కర్లేదు'
Published Sun, Aug 31 2014 3:10 PM | Last Updated on Sat, Sep 2 2017 12:41 PM
ముంబై: తనకు జేమ్స్ బాండ్ 007 ఇమేజ్ అవసరం లేదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ) గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ పదవి చేపట్టిన మిమ్మల్ని రాక్ స్టార్ గా, జేమ్స్ బాండ్ తో పోల్చిన విషయాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. గవర్నర్ పదవిని చేపట్టాక తన స్థాయికి తగ్గించుకునే నిర్ణయాలు తీసుకుంటున్నాను. ప్రజలకు భరోసా ఇచ్చే విధంగానే ఓ కేంద్ర ఉద్యోగి ప్రవర్తించాలి. నిర్ణయాలు తీసుకోవాలి అని రాజన్ అన్నారు.
రిజర్వు బ్యాంక్ గవర్నర్ కు జేమ్స్ బాండ్ ఇమేజ్ ఉండకూడదని ఆయన తెలిపారు. ఓ ప్రధానికి సలహాదారుడిగా, ముఖ్య ఆర్ధిక సలహాదారుడిగా సేవలందించిన తాను 2008 నుంచి నివేదికల, ఆర్ధిక వ్యవస్థలను పరిశీలిస్తున్నానని ఆయన తెలిపారు. చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అయితే నిర్ణయాలు తీసుకునేందుకు కొంత ఆలస్యం కావొచ్చన్నారు. అంతేకాకుండాతనకు జేమ్స్ బాండ్ ఇమేజ్ అవసరం లేదని.. ఓ బ్యాంకర్ గా తన విధులను సక్రమంగా నిర్వహించాననే సంతృప్తి చాలునని రఘురాం రాజన్ తెలిపారు.
Advertisement