ఐడియా సెల్యులర్కు వ్యయాల దెబ్బ | Idea Cellular reports Q1 net profit of Rs 217 crore | Sakshi
Sakshi News home page

ఐడియా సెల్యులర్కు వ్యయాల దెబ్బ

Published Tue, Aug 9 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

ఐడియా సెల్యులర్కు వ్యయాల దెబ్బ

ఐడియా సెల్యులర్కు వ్యయాల దెబ్బ

రూ.217 కోట్ల నికర లాభం
మొబైల్ రంగ మందగమన వృద్ధి మరికొంత కాలం
ఐడియా అంచనాలు

 న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం ఐడియా సెల్యులర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ. 217 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.852 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడియా సెల్యులర్ పేర్కొంది. ఇండియన్ అకౌంట్ స్టాండర్డ్(ఇండ్ యాస్) ఆధారంగా ఈ క్యూ1 ఫలితాలను రూపొం దించామని, అందుకని గత క్యూ1 ఫలితాలతో పోల్చడానికి లేదని వివరించింది. స్పెక్ట్రమ్ చార్జీలు లాభాలపై ప్రభావం చూపాయని పేర్కొంది.

 వడ్డీ వ్యయాలు రెట్టింపు: వడ్డీ వ్యయాలు రెట్టిం పయ్యాయని ఐడియా తెలి పింది. గత క్యూ1లో రూ.442 కోట్లుగా ఉన్న వడ్డీ వ్యయాలు ఈ క్యూ1లో రూ.988 కోట్లకు పెరిగాయని తెలిపింది. తరుగుదల రూ.1,412 కోట్ల నుంచి రూ.1,919 కోట్లకు,  మొత్తం ఆదాయం రూ.8,792 కోట్ల నుంచి రూ.9,487 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,500-7,000 కోట్ల మేర మూలధన పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యానికి అనుగుణంగానే ఈ క్యూ1లో రూ.1,080 కోట్ల పెట్టుబడులు పెట్టామని పేర్కొం ది. మొబైల్ రంగంలో మందగమన వృద్ధి మరికొంత కాలం కొనసాగుతుందని భావిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement