7.3 శాతం వృద్ధి.. ఇదే టాప్ స్పీడ్! | IMF cuts India's growth forecast to 7.3% for FY16 | Sakshi
Sakshi News home page

7.3 శాతం వృద్ధి.. ఇదే టాప్ స్పీడ్!

Published Sat, Jan 23 2016 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

7.3 శాతం వృద్ధి.. ఇదే టాప్ స్పీడ్!

7.3 శాతం వృద్ధి.. ఇదే టాప్ స్పీడ్!

భారత్‌పై ఐక్యరాజ్యసమితి నివేదిక
వచ్చే ఏడాది 7.5 శాతానికి చేరుతుందని అంచనా

 
 న్యూఢిల్లీ: భారత్ 2016 ఆర్థికాభివృద్ధి అంచనాలను ఐక్యరాజ్యసమితి (యూఎన్) పదిహేను రోజుల్లో మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ 7.5 శాతంగా ఉన్న ఈ అంచనా రేటును తాజాగా 7.3 శాతానికి కుదించింది. సంస్కరణల అమల్లో జాప్యం కారణాన్ని చూపుతూ పక్షం రోజుల క్రితం 8.2 శాతం అంచనాను యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ (ఆసియా-పసిఫిక్) ఈ నివేదిక 7.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
 
  తాజా నివేదికతో ఈ అంచనాను 7.3 శాతానికి తగ్గించినట్లయ్యింది. అయితే ఈ స్థాయి వృద్ధిని సైతం ప్రపంచంలోని ఏ దేశం సాధించే పరిస్థితి లేదని పేర్కొన్న ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక.. దేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంది.  రెండు రోజుల క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విడుదల చేసిన అంచనాలు సైతం 7.3 శాతం గమనార్హం. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితులు... 2016 అవకాశాలు’ అన్న పేరుతో విడుదలైన తాజా ఐక్యరాజ్యసమితి నివేదికను చూస్తే...
 
 భారత్ వృద్ధి రేటు వచ్చే ఏడాది 7.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణాసియా స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ వాటా 70%. 2015లో దేశం వృద్ధి 7.2 శాతం.
 
 2016, 2017ల్లో దక్షిణాసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం.
 ఈ ప్రాంతంలో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల తరహాలోనే భారత్‌లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు అదుపులో ఉన్నాయి. కమోడిటీ, మెటల్, ఆహార ధరల తగ్గుదల దీనికి కారణం.
 
 పరిశ్రమల మందగమనం, సంస్కరణల అమల్లో వేగం లేకపోవడం, అడ్డంకులు వంటి సవాళ్లను ప్రభుత్వం ఎదుర్కొంటున్నా...  విని యోగ, పెట్టుబడిదారు విశ్వాసం పెరిగింది. మౌలిక, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. వీటిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది.  పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం, వ్యవసాయ రంగంలో అననుకూల పరిస్థితులు ఆందోళనకరమే. వృద్ధి మరింత పటిష్టంగా, సుస్థిరంగా మారాల్సిన అవసరం ఉంది.
 
 క్రమ వృద్ధి తీరు: మోర్గాన్‌స్టాన్లీ
 భారత్ వృద్ధి సంకేతాలనే ఇస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. రానున్న రెండేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఐదు శాతం దిగువన ఉండే అవకాశం ఉందని అంచనావేసింది. వినియోగం, ప్రభుత్వ రంగ పెట్టుబడులు, విదేశీ ప్రైవేటు పెట్టుబడుల రాక వంటి అంశాలు భారత్ వృద్ధి ధోరణికి మద్దతుగా నిలుస్తున్న అంశాలని వివరించింది.
 
 డిసెంబర్‌లో ఐఐపీ 5 శాతం: డీఅండ్‌బీ
 ప్రస్తుతం తీవ్ర నిరాశ కలిగిస్తున్న దేశ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) డిసెంబర్‌లో మాత్రం 4 నుంచి 5 శాతం వరకూ వృద్ధి సాధించే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) తాజా నివేదిక అంచనావేసింది. అయితే బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణంగా తెలిపింది. పెట్టుబడులు పెరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా మరొక కారణంగా నిలుస్తాయని తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement