భారత్‌లో అతిపెద్ద కంపెనీ ఐఓసీ
న్యూఢిల్లీ: ఆదాయాలపరంగా భారత్‌లో అతిపెద్ద కంపెనీగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) నిలిచింది. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజీన్ ఫార్చూన్ రూపొందించిన 2014 ఏడాది టాప్-500 భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. పూర్తి ఏడాదికి కంపెనీ రూ.5,00,973 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఫార్చూన్ పేర్కొంది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.4,44,021 కోట్ల వార్షిక ఆదాయంతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) మూడో ర్యాంకు(ఆదాయం రూ.2,67,718 కోట్లు), హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) నాలుగు(రూ.2,67,718 కోట్లు), టాటా మోటార్స్(రూ.2,36,502 కోట్లు) ఐదో ర్యాంకును చేజిక్కించుకున్నాయి. కాగా, ఐఓసీ, రిలయన్స్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు గతేడాది(2013) ర్యాంకులను నిలబెట్టుకోవడం గమనార్హం.
టాప్-10లో ఎస్‌బీఐ (రూ.2,26,944 కోట్లు- 6వ ర్యాంకు), ఓఎన్‌జీసీ(రూ.1,82,084 కోట్లు, 7వ ర్యాంకు), టాటా స్టీల్(రూ.1,49,663 కోట్లు, 8వ స్థానం), ఎస్సార్ ఆయిల్(రూ.99,473 కోట్లు, 9వ స్థానం), హిందాల్కో(రూ.89,175 కోట్లు, 10వ ర్యాంకు) నిలిచాయి.