బంగారం దిగుమతులు ఈ జూన్‌లో భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఈ నెలలో కేవలం 11టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిందటేడాది ఇదే జూన్‌లో దిగుమతైన మొత్తం 77.73 టన్నులతో పోలిస్తే ఇది 86శాతం తక్కువ. కరోనా కట్టడిలో భాగంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలను నిషేధించడం, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బంగారు ఆభరణాల దుకాణాలు మూసివేసివేయడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం తదితర కారణాలు బంగారం దిగుమతులు పడిపోవడానికి కారణమైనట్లు బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. విలువ పరంగా చూస్తే.., గతేడాది జూన్‌లో దిగుమతుల మొత్తం విలువ 2.7బిలయన్ డాలర్లు ఉండగా, ఈ జూన్‌లో 608.76మిలియన్ డాలర్లకు పరిమితమైంది. (లాభాల స్వీకరణతో దిగివచ్చిన బంగారం)
Comments
Please login to add a commentAdd a comment