మీడియా సమావేశంలో సోమ రాజు, శివ రామ రాజు, రామ్ పాపా రావు (ఎడమ నుంచి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న కత్రియ గ్రూప్ వైద్య సేవల్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ఎస్‌ఎల్‌జీ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 550 పడకలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ సీఎండీ దండు శివ రామ రాజు బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. 2022 నాటికి ఆసుపత్రిని 999 పడకల స్థాయికి చేరుస్తామని వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.350 కోట్లని వివరించారు. నర్సింగ్ స్కూల్, హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ సైతం ఏర్పాటు చేస్తామన్నారు. అత్యాధునిక పాథాలజీ ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందని చెప్పారు. ప్రస్తుతం 42 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయని ఎస్‌ఎల్‌జీ సీఈవో ఏ.రామ్ పాపా రావు తెలిపారు. 140 మంది వైద్యులు, 280 మంది ప్యారా మెడికల్ సిబ్బందిని నియమించామన్నారు.
హోటల్ సైతం ఇక్కడే..: ఆసుపత్రికి ఆనుకుని 3 స్టార్ హోటల్ సైతం నిర్మిస్తున్నారు. 120 గదులతో సిద్ధమవుతున్న ఈ హోటల్ మార్చికల్లా రెడీ అవుతుందని సంస్థ ఈడీ డీవీఎస్ సోమ రాజు తెలిపారు. ఇందులో 1,000 మంది కూర్చునే వీలున్న సమావేశ మందిరం ఉం టుం దని చెప్పారు. ఆసుపత్రికి ఆనుకుని హోటల్ ఉం డడం రోగులకు (ముఖ్యంగా విదేశీయులకు) కలిసి వస్తుందన్నారు. ఎయిర్ అంబులెన్స్‌కు హెలిప్యాడ్ సైతం నిర్మించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment