సాక్షి, ముంబై: సరికొత్త రికార్డులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్‌మీట్ షాక్ తగిలింది. ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరుపై ఆరోపణలు గుప్పిస్తూ మీడియా సమావేశం నిర్వహించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లలో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో దేశీ సూచీలు గరిష్ట స్థాయిల నుంచి వెనక్కి తగ్గాయి.
ఒక దశలో నిఫ్టీ 10, 700 స్థాయికి అతి సమీపంలోకి వచ్చింది. కానీ అనూహ్య పరిణామంతో ప్రస్తుతం సెన్సెక్స్ 133 పాయింట్లు కుప్పకూలగా నిఫ్టీ కూడా అదే బాటలో 50 పాయింట్లు కోల్పోయింది. టాప్ విన్నర్స్‌గా ఉన్న స్టాక్స్ ఒక్కసారిగా ఇండియా బుల్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, గెయిల్ నష్టాల్లోకి జారుకున్నాయి. జీ, సన్‌టీవీ, వేదాంతా లాభాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment