
సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. ఎంఐ ఏ సిరీస్‌లో భాగంగా తాజాగా ‘ఎంఐ ఏ3’ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. భారీ అప్‌డేట్స్‌తో అద్భుత ఫీచర్లతో రెండు వేరియింట్లలో మూడు రంగుల్లో దీన్ని తీసుకొచ్చింది. 4జీబీ/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 వద్ద, 6జీబీ/128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999 వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రిపుల్ రియర్ కెమెరా డాట్‌నాచ్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, తొలి ఆండ్రాయిడ్ క్వాల్కం అపడేట్ ఫోన్ లాంటి సూపర్ అప్‌డేట్స్ తో ఎంఐఏ3 ఆవిష్కరించామని షావోమి ప్రకటించింది.
ఎంఐ ఏ3 ఫీచర్లు
6.08అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 665 ప్రాససర్
720x1560 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0
4జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
48+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
4030 ఎంఏహెచ్ బ్యాటరీ