జీఎస్‌పీసీ బ్లాక్‌లో వాటాల కొనుగోలుకు | ONGC to buy entire GSPC stake in KG Basin for $1.2 bn | Sakshi
Sakshi News home page

జీఎస్‌పీసీ బ్లాక్‌లో వాటాల కొనుగోలుకు

Published Sat, Feb 25 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

జీఎస్‌పీసీ బ్లాక్‌లో వాటాల కొనుగోలుకు

జీఎస్‌పీసీ బ్లాక్‌లో వాటాల కొనుగోలుకు

ఓఎన్‌జీసీ బోర్డు ఓకే
డీల్‌ విలువ దాదాపు రూ. 8,000 కోట్లు


న్యూఢిల్లీ: కేజీ–బేసిన్‌లోని గ్యాస్‌ బ్లాక్‌లో జీఎస్‌పీసీకి ఉన్న మొత్తం 80 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్‌ విలువ 1.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8,000 కోట్లు). 2014 ఆగస్టు నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తున్న కేజీ–ఓఎస్‌ఎన్‌–2001/3 బ్లాక్‌లోని మూడు అన్వేషణ క్షేత్రాలకు 995.26 మిలియన్‌ డాలర్లు ఓఎన్‌జీసీ చెల్లించనుంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మరో ఆరు డిస్కవరీలకు 200 మిలియన్‌ డాలర్లు చెల్లించనుంది. ఈ ఆరు క్షేత్రాల అభివృద్ధికయ్యే వ్యయాలు కూడా ఓఎన్‌జీసీనే భరించాల్సి ఉంటుంది.

ఈ వ్యయాలు కనీసం మరికొన్ని బిలియన్‌ డాలర్ల మేర ఉంటాయని అంచనా. రుణభారంతో కుంగుతున్న గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జీఎస్‌పీసీ)కి కేజీ–బేసిన్‌ బ్లాక్‌లో ఉన్న వాటాలను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీసీ గతేడాది డిసెంబర్‌ 23న అంగీకరించింది. 2015 మార్చి 31 నాటికి జీఎస్‌పీసీ రుణభారం దాదాపు రూ. 19,716.27 కోట్ల మేర ఉంది. జీఎస్‌పీసీ ఇప్పటిదాకా బంగాళాఖాతంలో 9 గ్యాస్‌ క్షేత్రాలను కనుగొంది. వీటిలో మూడింటి (దీన్‌దయాళ్‌ వెస్ట్‌–డీడీడబ్ల్యూ) అభివృద్ధికి అనుమతులు లభించాయి.

ప్రభుత్వానికి సమర్పించిన క్షేత్రాల అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్‌డీపీ) ప్రకారం 2.75 బిలియన్‌ డాలర్ల వ్యయానికి అనుమతులు ఉన్నప్పటికీ .. వాస్తవంగా వ్యయాలు 2.83 బిలియన్‌ డాలర్లు దాటాయి. అన్వేషణకు సంబంధించి మరో 585 మిలియన్‌ డాలర్ల మేర ఖర్చయ్యింది. దీంతో 2015 మార్చి ఆఖరు నాటికి మొత్తం వ్యయం 3.41 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఎఫ్‌డీపీ ప్రకారం మరో 12 బావుల తవ్వకం పూర్తి చేయాలి. దీంతో ప్రాజెక్టు వ్యయం మరింతగా పెరగనుంది. 2014 ఆగస్టులో డీడీడబ్ల్యూలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement