జియో ఎఫెక్ట్: ఉచిత ఆఫర్లకు ఇక గుడ్ బై
జియో ఎఫెక్ట్: ఉచిత ఆఫర్లకు ఇక గుడ్ బై
Published Thu, Apr 27 2017 7:15 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM
ముంబై : ఉచిత సేవలతో ఇటు టెలికాం దిగ్గజాలకు షాకిలమీద షాకిలిచ్చిన రిలయన్స్ జియోతో టెలికాం రెగ్యులేటరి ట్రాయ్కు కొత్త తలనొప్పులు వచ్చాయి. రిలయన్స్ జియో ఉచిత సేవల ఆఫర్లపై గుర్రుగా ఉన్న ఇతర టెలికాం సంస్థలు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ దగ్గర కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు నమోదుచేశాయి. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ట్రాయ్, ఇక నిబంధనలనే కఠినతరం చేయాలని యోచిస్తోంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చే టెలికాం ఆపరేటర్ల కోసం కఠినతరమైన నిబంధనలు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. మే వరకు కొత్త నిబంధనలకు సంబంధించి సంప్రదింపుల ప్రక్రియ చేపట్టాలని ట్రాయ్ యోచిస్తోంది. కొత్త ఆపరేటర్లు తమ సిగ్నల్ ను పరీరక్షించే సమయంలో ఆ ఆపరేటర్ కు గరిష్టంగా ఎంతమంది సబ్ స్క్రైబర్లు ఉండాలని, ఎంతకాలం పరీక్షించాలని అనే వాటిపై నిబంధనలు ట్రాయ్ రూపొందిస్తోందని తెలుస్తోంది.
ఈ సేవలను కూడా ఉచితంగా ఇవ్వాలా వద్దా అన్నదానిపై కూడా ట్రాయ్ నిర్ణయించనుందట. ఈ విషయంపై మే లోపు ఓ కన్సాలిడేషన్ పేపర్ ను కూడా ట్రాయ్ జారీచేయనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉచిత ఆఫర్లకు గండిపడనుందని తెలుస్తోంది. గతేడాది టెలికాం సెక్టార్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో, ఉచిత ఆఫర్లతో తమ కస్టమర్లను తన్నుకుపోయిందనే ఆరోపణలను సెల్యులార్ ఆపరేటర్స్ బాడీ కోయ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జియో సైతం భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ లు తమకు అవసరమైన మేర ఇంటర్ కనెక్షన్ పోర్ట్స్ ఇవ్వడం లేదని ఆరోపించింది. గతేడాది సెప్టెంబర్ లో జియో తన కమర్షియల్ సర్వీసులను తీసుకొచ్చింది. అప్పటి నుంచి మార్చి చివరి వరకు ఉచిత ఆఫర్లు అందించి, ఏప్రిల్ నుంచి టారిఫ్ ప్లాన్స్ ను అమలుచేస్తోంది. ఈ టారిఫ్ ప్లాన్స్ లోనూ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
Advertisement