
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్ స్కాం కేసులో పాక్షిక మార్పులతో కూడిన తీర్పును సెబీ వెలువరించింది. దీని ప్రకారం కంపెనీ మాజీ సీఎఫ్‌వో వడ్లమూడి శ్రీనివాస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి.రామకృష్ణపై ఏడేళ్ల పాటు, ఇంటర్నల్ ఆడిట్ మాజీ హెడ్ వి.ఎస్.ప్రభాకర గుప్తాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ కాలంలో వారు సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనే వీలుండదు. ఇప్పటికే కొనసాగుతున్న నిషేధ కాలంతో కలిపి ఈ పీరియడ్ ఉంటుంది.
అలాగే అక్రమంగా ఆర్జించినందుకుగాను శ్రీనివాస్ రూ.15.65 కోట్లు, రామకృష్ణ రూ.11.5 కోట్లు, గుప్తా రూ.48 లక్షలు జరిమానా కింద స్కాం బయటపడ్డ 2009 జనవరి 7 నాటి నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాలు వెలువరించింది. ముగ్గురిపై 14 ఏళ్ల నిషేధంతోపాటు శ్రీనివాస్, రామకృష్ణ, గుప్తాపై వరుసగా రూ.29.5 కోట్లు, రూ.11.5 కోట్లు, రూ.51.26 లక్షల జరిమానా చెల్లించాలని 2014 జూలైలో సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఈ ముగ్గురు సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment