
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకోని సూచీలు ఒక దశలో 12 వేల స్థాయిని కూడా కోల్పోయింది. అయితే చివరి గంటలో రిలయన్స్ 2 శాతం పుంజుకోవడంతో సూచీలు భారీగా తగ్గాయి. చివరకు సెన్సెక్స్162 పాయింట్ల నష్టంతో 40980 వద్ద, నిఫ్టీ 67పాయింట్లు నష్టపోయి 120632 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ మరింత విజృంభిస్తూ వుండటంతో చైనాలో మృతుల సంఖ్య 900 పైకి చేరింది. మెటల్,ఆటో, మీడియా, పీఎస్‌యూబ్యాంక్స్, రియల్టీ, ఫార్మ రంగాలు నష్టపోయాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్, సన్‌ఫార్మ , హీరోమోటా కార్ప్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్ర, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్ ,రిలయన్స్ ప్రధానంగా లాభపడ్డాయి.