
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అమెరికా , ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఆరంభంలోనే 500పాయింట్లు జంప్ చేసింది. ప్రస్తుతం 421 పాయింట్ల లాభంతో 32128 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు ఎగిసి 9418 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 32 వేల ఎగువన, నిఫ్టీ 9400 స్థాయికి ఎగువన కొనసాగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం లాభపడుతోంది. బ్యాంకింగ్ , ఆటో రంగ షేర్లలో షార్ట్ కవరింగ్ బాగా కనిపిస్తోంది. ఐషర్ మోటర్స్, యూపీఎల్, వేదాంత, జీ లిమిటెడ్, ఓఎన్జీసీ లాభపడుతుండగా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, ఏషియన్ పేయింట్స్ షేర్లు నష్టపోతున్నాయి. (రూ.5.8 లక్షల కోట్లు ఆవిరి)
Comments
Please login to add a commentAdd a comment