సాక్షి, ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లలో బడ్జెట్ -2019 హుషారు కనిపించింది. ఆరంభంలోనే సెన్సెక్స్ సెంచరీ లాభాలు సాధించింది. తద్వారా సెన్సెక్స్ 40వేల పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. అయితే ఎనలిస్టులు హెచ్చరించినట్టుగానే ఆటు పోట్లకు లోనవుతోంది. సెన్సెక్స్ స్వల్ప వెనుకంజ వేసింది.ప్రస్తుతం సెన్సెక్స్40 పాయింట్లు ఎగిసి 39947 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లాభాలకు పరిమితమై 11948 వద్ద కొనసాగుతోంది.
కేంద్ర ఆర్థిక బడ్జెట్‌కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లకు పెద్దగా రుచించలేదు. ఈ నేపథ్యంలో ఆటుపోట్లలో సూచీలు కొనసాగుతాయని, అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. తొలి మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సార్వత్రిక బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాంప్రదాయం ప్రకారం ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ కాపీలను అందించారు. ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment