మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ మార్కెట్ పురోగమించింది. ప్రధానంగా సెన్సెక్స్ దిగ్గజం ఐటీసీ 5.5% ..
సెన్సెక్స్ 120 పాయింట్లు ప్లస్
28,563 వద్ద ముగింపు
కొత్త గరిష్టాన్ని తాకిన నిఫ్టీ
మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ మార్కెట్ పురోగమించింది. ప్రధానంగా సెన్సెక్స్ దిగ్గజం ఐటీసీ 5.5% పుంజుకోవడం ద్వారా మార్కెట్‌కు అండగా నిలిచింది. ప్రభుత్వం విడి సిగరెట్ల అమ్మకాలను నిషేధించబోవడంలేదన్న వార్తలు ఇందుకు దోహదపడ్డాయి. వెరసి బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ రంగం అత్యధికంగా 3% జంప్‌చేసింది. సెన్సెక్స్ 120 పాయింట్లు లాభపడి 28,563 వద్ద నిలవగా, 27 పాయింట్లు పురోగమించిన నిఫ్టీ 8,564 వద్ద ముగిసింది.
అంతకుముందు ఒక దశలో 8,627కు చేరడం ద్వారా కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల్లో విదేశీ మార్కెట్లు: ఆర్థిక వ్యవస్థ పటిష్టస్థాయిలో పురోగమిస్తున్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు బుధవారం కొత్త గరిష్టాలనుతాకగా, ఈ ప్రభావంతో గురువారం చైనా ఇండెక్స్ 4% పుంజుకుంది. ఈ బాటలో ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం లాభపడ్డాయి. కాగా, గురువారం సాయంత్రం వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలో కొనసాగిస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది.
వచ్చే డిసెబర్‌కల్లా 9,500కు నిఫ్టీ :గోల్డ్‌మన్ శాక్స్
2015 డిసెంబర్‌కల్లా నిఫ్టీ 9,500 పాయింట్లను తాకుతుందని తాజా గా యూఎస్ బ్రోకరేజీ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో వర్థమాన దేశాలలో భారత్ ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తుందని తన తాజా నివేదికలో తెలిపింది.