సీఆర్‌ఐ నుంచి స్టెయిన్‌లెస్ స్టీల్ పంప్స్
హైదరాబాద్: పంప్స్ ఉత్పత్తిలో దేశంలో ప్రముఖ సంస్థల్లో ఒకటైన సీఆర్‌ఐ నుంచి పూర్తిస్థాయి స్టెయిన్‌లెస్ స్టీల్ సబ్‌మెర్సిబుల్ పంప్స్ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఈ పంపులు తుప్పు పట్టకుండా ఎక్కువకాలం మన్నికతో ఉంటాయని సంస్థ వైస్ చైర్మన్ జీ సౌందర్ రాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పంపులలో ఇన్‌బిల్ట్ చెక్‌వాల్వ్‌ను బిగించారు. పంపుల తయారీకి ఎస్‌ఎస్ 304, ఎస్‌ఎస్ 316 గ్రేడ్ స్టీల్‌ను ఉపయోగిస్తారు. తక్కువ విద్యుత్‌తో ఎక్కువ నీటిని పంప్ చేయడం వీటి ప్రత్యేకత. ఇసుక, ఇతర రేణువులను సమర్థంగా ఎదుర్కొని సాధారణ పంపుల కంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి (100ఎంఎం) 4’’, (150ఎంఎం) 6’’, (200ఎంఎం) 8’’ మోడళ్లలో లభ్యమవుతాయి. సంస్థ ఉత్పత్తులు 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.