టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్
సాక్షి, బెంగళూరు : తనను బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మోసం చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ విమర్శించారు. ఆ కంపెనీపై సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బెంగళూరుకు చెందిన విక్రమ్ ఇన్వెస్టిమెంట్స్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటే రూ.20కోట్లు పెట్టుబడి పెట్టానని తెలిపారు. అయితే లాభాలు ఇవ్వకపోగా అసలు పెట్టుబడిలో రూ.4కోట్లు ఆ కంపెనీ తమను మోసం చేసిందని వాపోయారు.
ఆ కంపెనీ ఇదివరకే 800 మంది పెట్టుబడిదారులను మోసం చేసి దాదాపు రూ.300 కోట్ల మేర డబ్బు మాయం చేసినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన పీఆర్.బాలాజీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఇటీవల ఈ ఉదంతం వెలుగుచూసింది. ఈ కంపెనీపై ఇప్పటివరకు 100కుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిలో ద్రావిడ్‌తో పాటు బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తండ్రి, బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment