
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్–2020 టోర్నమెంటు 2021లో ఆస్ట్రేలియాలో జరిగితే ఇప్పటికే కొనుక్కున్న టికెట్లతో ఫ్యాన్స్ మ్యాచులు వీక్షించొచ్చని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ ఆస్ట్రేలియా 2022 టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తే, ఈ టికెట్ల డబ్బు వాపసు వస్తుందని పేర్కొంది. (విదేశాల్లో ఆడుకుంటాం.. అనుమతివ్వండి)
కోవిడ్–19 వల్ల ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి ఐసీసీ సోమవారం వాయిదా వేసింది. 2021, 2022ల్లో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను నిర్వహిస్తామని తెలిపింది. (2021లో 20–20 ప్రపంచకప్)
2021 టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఆతిథ్యం ఇవ్వాలి. కానీ దీనిపై ఐసీసీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment