ఆడుకుంటూనే రైలు కిందకు దూకేశాడా? | blue whale game killed School Boy in UP shamli | Sakshi
Sakshi News home page

ఆడుకుంటూనే రైలు కిందకు దూకేశాడా?

Published Sat, Sep 23 2017 10:59 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

blue whale game killed School Boy in UP shamli - Sakshi

సాక్షి, లక్నో : బ్లూవేల్‌ భూతం మరో ముక్కు పచ్చలారని ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్లూవేల్‌ ఆడుకుంటూనే వేగంగా దూసుకొస్తున్న రైలు కింద పడి చనిపోయినట్లు సమాచారం. 

షామ్లికి చెందిన నిశాంత్‌ గత కొంత కాలంగా బ్లూవేల్‌ ఛాలెంజ్‌ ఆడుతున్నాడని.. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయాడని అతని స్నేహితులు చెబుతున్నారు. కాగా, ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం మొబైల్‌ చేతిలో ఉన్న బాలుడు ఒక్కసారిగా రైలు ముందుకు దూకేశాడని తెలిపారు. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మిస్టరీని చేధించే పనిలో నిమగ్నమయ్యారు.

మరోపక్క మధ్యప్రదేశ్‌ రాయ్‌గఢ్‌లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తాను బ్లూవేల్‌ గేమ్‌ 49వ లెవల్‌కి చేరుకున్నానని.. ఆత్మహత్య చేసుకోవాలంటే భయంగా ఉందంటూ పరీక్ష సమాధాన పత్రంలో రాశాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యాన్ని అప్రమత్తం చేయగా.. బాలుడికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement