సాక్షి, కర్నూలు: నగరంలోని కృష్ణానగర్‌లో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడి కిలో బంగారం, రూ.4 లక్షల నగదును దోచుకెళ్లారు. స్థానిక రవీంద్ర స్కూల్ వెనుక వైపు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలోకీ చోరీ జరిగింది. పిల్లల ఫీజుల కోసం దాచి ఉంచిన నగదును దోచుకెళ్లారని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నెల్లూరుకు వెళ్లగా దొంగతనం జరిగిందని, ఈ ఉదయం పక్కింటి వారు గుర్తించడంతో చోరీ విషయం తెలిసిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.