
సంఘటనా స్థలంలో ప్రమాదానికి గురైన కారు, మృత దేహాలు
సాక్షి, నల్గొండ : జిల్లాలోని చింతపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి బస్టాండ్ గోడను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్తున్న ఓ కారు నసర్లపల్లి వద్ద అదుపుతప్పి బస్టాండ్ గోడను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ టోలీచౌక్‌కి చెందిన మెహిన్, అక‍్బర్, ముస‍్తఫా, సద్దాం, సమ్మి మృతి చెందారు. ఐదు కుటుంబాలు వేర్వేరు వాహనాల్లో విహారయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment