
మృతుడు మున్నా కుమార్ (ఫేస్‌బుక్ ఫొటో)
‘తల్లిదండ్రుల ఆశ నెరవేర్చ లేకపోయాను’
లక్నో : ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. వివరాలు... ఆగ్రాకు చెందిన మున్నా(24) అనే యువకుడికి ఆర్మీలో ఉద్యోగం చేయలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో స్థానికంగా జరిగిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆర్మీలో చేరాలంటే ఉండాల్సిన కనీస వయసు, విద్యార్హతల గురించి తెలుసుకున్న అనంతరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘భారత ఆర్మీలో పని చేయాలనుకున్నాను... కానీ అందుకు కావాల్సిన అర్హతలు నాకు లేవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సుమారు 2 వేల మంది మున్నా లైవ్‌ను చూసినప్పటికీ ఒక్కరు కూడా ఈ విషయం గురించి పోలీసులకు గానీ, అతడి కుటుంబ సభ్యులకు గానీ సమాచారం అందించలేదు.
తల్లిదండ్రుల ఆశను నెరవేర్చలేకపోయా..
ఆరు పేజీలతో కూడిన సూసైడ్ నోట్‌ను మున్నా శవం వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల కోరిక ప్రకారం ఆర్మీ ఎంట్రన్స్‌లో అర్హత సాధించలేక పోయినందు వల్లే అతడు ఆత్మహత్యకు పాల్పడట్టు వెల్లడించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం బాడీని తరలించినట్లు పేర్కొన్నారు. కాగా భగత్ సింగ్‌ను రోల్ మోడల్‌గా భావించే మున్నా.. ఇలాంటి పిరికి చర్యకు పాల్పడతాడని అనుకోలేదని అతడి తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు.