
దస్తగిరిరెడ్డి (ఫైల్)
కలసపాడు: మండల పరిధిలోని పిడుగుపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి నాగిరెడ్డి దస్తగిరిరెడ్డి (28) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగుపల్లెకు చెందిన నాగిరెడ్డి పిచ్చిరెడ్డి, వెంకటసుబ్బమ్మ కుమారుడు దస్తగిరిరెడ్డి మహారాష్ట్రలోని పూణేలో 13 ఏళ్లుగా ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చెందిన క్రిష్ణవేణితో వివాహమైంది. వీరికి రెండు నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. దస్తగిరిరెడ్డి ఇటీవల 15 రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు.
ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి బెడ్ రూంలో ఒకడే పడుకున్నాడు. తెల్లవారి చూసే సరికి ఫ్యా¯న్‌కు చీరతో ఉరేసుకుని మరణించాడు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని కిందికి దించారు. మెడ చుట్టూ కమిలిపోయి ఉంది. మృతునికి చెల్లెలు ఉంది. దస్తగిరిరెడ్డి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment