బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య | Btech Student Commits Suicide | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Apr 26 2018 9:31 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Btech Student Commits Suicide - Sakshi

భవాని మృతదేహం (ఇన్‌సెట్‌) భవాని(ఫైల్‌)

పుంగనూరు : పట్టణ పరిధిలోని పలమనేరు రోడ్డులో ఉన్న సుబ్బమ్మ చెరువులో ఓ యువతి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. సీఐ సాయినాథ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బజారు వీధిలో కాపురముంటున్న శివలింగప్ప కుమార్తె భవాని (20) మదనపల్లె సమీపంలోని ఓ కళాశాలలో బీటెక్‌ మూడవ సంవత్సరం  చదువుతోంది. మంగళవారం రాత్రి తల్లి దండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది 8.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఎంత వెతికినా ఆచూకీ కనిపించలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుబ్మమ్మ చెరువులో ఎవరిదో మృతదేహం తేలివుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటికే తమ కూతురు కనిపించలేదని పోలీసు స్టేషన్‌కు శివలింగప్ప వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు మృతురాలి ఫొటో చూపించగా తన కుమార్తె అని గుర్తించడం జరిగిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement