
ప్రతీకాత్మకచిత్రం
ముంబై : సహోద్యోగి కుమార్తె పట్ల అసభ్యంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన వెలుగుచూసింది. ఘట్కోపర్‌లోని పంత్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హరిష్‌చంద్ర లహానే (41) పోలీస్‌క్వార్టర్స్‌లో తన ఇంటి ఎదుటనే ఉండే సహోద్యోగి, పోలీస్ అధికారి కుమార్తె పట్ల అనుచితంగా వ్యవహరించాడు.
బాధిత యువతి (22) తన ఇంటిలోని బాల్కనీలో నిల్చుని తమ బంధువుతో మాట్లాడుతుండగా లహానే తన బాల్కనీ నుంచి ఆమెకు అసభ్యంగా సైగలు చేయడంతో పాటు లోదుస్తులు విప్పి అమర్యాదకరంగా వ్యవహరించాడు. బాధిత యువతి ఇంటిలోకి వెళ్లి కుటుంబ సభ్యులకు వివరించడంతో నెహ్రూనగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన ముంబై పోలీసులు లహానేను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంది. కాగా నిందితుడు కొంత కాలంగా భార్యకు దూరంగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment