
ఆవులను తస్కరిస్తున్న దృశ్యం
కృష్ణరాజపురం: ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన సోమవారం రాత్రి కేఆర్‌పురం పరిధిలోని దేవసంద్రలో చోటు చేసుకుంది. దేవసంద్రలోని ఉర్దూ పాఠశాల సమీపంలో మునిరాజు, రత్న దంపతులు పాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజూ తరహాలోనే సోమవారం సాయంత్రం పాలను పితికి వాటిని రాత్రి సమయంలో ఇంటి ఆవరణలో కట్టేశారు. మంగళవారం తెల్లవారేసరికి ఆవులు కనిపించలేదు. దీంతో కేఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా కొంతమంది వ్యక్తులు ఆవులను అపహరించిన దృశ్యాలు కనిపించాయి. ఫుటేజ్‌ల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు.