కొడుకు పరిస్థితి చూసి రగిలిపోయిన ఓ తండ్రి... | Dad Thrashes School Teacher for Punished his son | Sakshi
Sakshi News home page

కొడుకు పరిస్థితి చూసి రగిలిపోయిన ఓ తండ్రి...

Published Fri, Nov 10 2017 7:09 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Dad Thrashes School Teacher for Punished his son - Sakshi

సాక్షి, ముంబై : తన కొడుకును ఓ టీచర్‌ కొట్టాడన్న వార్త తెలియగానే ఆ తండ్రి కోపంతో రగిలిపోయాడు. నేరుగా స్కూల్‌కి పరిగెత్తి గల్లా పట్టి అతన్ని బయటకు గుంజుకొచ్చాడు. ఆపై చితకబాదుతూ తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ముంబైలోని విరార్‌ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.

జయదీప్‌ విద్యా మందిర్‌లో ఆరో తరగతి చదువుతున్న నితిన్‌ శర్మ(11) అనే విద్యార్థిని అల్లరి చేస్తున్నాడన్న కారణంతో దినేశ్‌ షిండే(31) అనే ఉపాధ్యాయుడు దండించాడు. అయితే అది కాస్త శ్రుతి మించటంతో నితిన్‌ కళ్లు తిరిగి పడిపోయాడు. ఊపిరి అందక అవస్థ పడుతున్న విధ్యార్థిని దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించగా.. కాసేపటికి అతను కోలుకున్నాడు. అయితే ఆస్పత్రి బెడ్‌ మీద తన కొడుకు అపస్మారక స్థితిలో ఉండటం చూసిన తండ్రి నర్సింగ్‌ శర్మ కోపంతో ఊగిపోతూ స్కూల్‌కి వచ్చాడు.

దినేశ్‌ను లాక్కుంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చి చితకబాదాడు. ఈ క్రమంలో అతనికి కొందరు స్థానికులు కూడా తోడయ్యారు. ఆపై వీరార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇరువురికి కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు ఈ విషయంలో ఫిర్యాదు చేయబోమని రాతపూర్వక హామీ తీసుకుని వదిలేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగుపడిందని.. మెడకు మాత్రం స్వల్ఫ గాయమైందని వైద్యులు వెల్లడించారు. పిల్లలను దండించటంలో తప్పు లేదని.. అయితే అది మరీ మితిమీరటంతోనే తాను ఇలా స్పందించాల్సి వచ్చిందని నర్సింగ్‌ చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement