ఇమ్లిబన్‌లో చిత్తూరు బస్సు ఎక్కినట్లు ఆనవాలు.. | Dasari Tarak Prabhu Missing Case Transfer to Chittoor Police | Sakshi
Sakshi News home page

దాసరి ప్రభు అదృశ్యంపై ఫిర్యాదు

Published Fri, Jun 14 2019 7:54 AM | Last Updated on Fri, Jun 14 2019 8:15 AM

Dasari Tarak Prabhu Missing Case Transfer to Chittoor Police - Sakshi

దాసరి తారక ప్రభు (ఫైల్‌)

హైదరాబాద్‌ : దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) కనిపించడం లేదంటూ అతడి మేనమామ నార్ల సురేంద్రప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 5న రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తారక ప్రభు ఈనెల 7వ తేదీ వరకు కూకట్‌పల్లిలోని తన పెద్ద అల్లుడి ఇంట్లో ఉన్నాడని, 8వ తేదీన పని ఉందంటూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–46లోని తన కార్యాలయానికి వెళ్లిన అతను ఆ రోజు రాత్రి తన ఇంట్లోనే పడుకున్నట్లు తెలిపారు. ఈ నెల 9 వ తేదీ సాయంత్రం వరకు ఇంట్లోనే ఆఫీస్‌ పనులు చూసుకున్న ప్రభు ఇంటి వద్ద ఆటో ఎక్కి వాచ్‌మెన్‌ బహదూర్‌కు చెప్పి బయటికి వెళ్లిపోయాడన్నారు.

అదే రోజు సాయంత్రం అతడి భార్య పద్మావతి ప్రభుకు ఫోన్‌ చేయగా, ఫోన్‌ రింగ్‌ అయినా కాల్‌ కట్‌ అవుతోందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫోన్‌స్విచ్‌ ఆఫ్‌ అయినట్లు తెలిపాడు. అతడి ఆచూకీ లేక పోవడంతో బుధవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు  జూబ్లీహిల్స్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. గురువారం తెల్లవారుజామున ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. మరో వైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా గాలిస్తున్నారు. అతడి కాల్‌డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా  ప్రభు ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్‌లో చిత్తూరు బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు అతడు చిత్తూరుకు వెళ్లి ఉంటాడని  ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో వారు గాలింపు ముమ్మరం చేపట్టారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement