పోలీసులపై మందుబాబుల దాడి | Drinkers Attacks On Traffic Hyderabad | Sakshi
Sakshi News home page

పోలీసులపై మందుబాబుల దాడి

Jul 14 2019 9:53 PM | Updated on Jul 14 2019 10:21 PM

Drinkers Attacks On Traffic Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోన్న పోలీసులపై మందుబాబులు దాడిచేశారు.  ఈ సంఘటన చంపాపేటలో జరిగింది. యాకుత్‌పురాకు చెందిన రపూఫ్‌, జహంగీర్‌లను ట్రాఫిక్‌ పోలీసులు ఆపి బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేస్తుండగా వారు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసుల మీద పడి పిడిగుద్దులు గుప్పించారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌బాబు, హోంగార్డు రాజేశ్వర్‌ సింగ్‌లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై పోలీసులు సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement