
లండన్ : తాగిన మైకంలో ఓ వ్యక్తి తన ఇల్లు అనుకుని పొరుగింటికి వెళ్లడమే కాక ఆ ఇంటి యజమానిని దొంగ అనుకుని హతమార్చిన ఘటన కలకలం రేపింది. మిసోరికి చెందిన మైఖేల్ అగస్టీన్ తన పొరుగున ఉండే 60 ఏళ్ల మాజీ సైనికుడిని హత్య చేశాడు.పొరుగింటి వ్యక్తిని పొట్టనపెట్టుకున్న వెంటనే మైఖేల్ అగస్టీన్ (43) పోలీసులకు ఫోన్ చేసి తన ఇంట్లో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని చంపేశానని చెప్పడంతో అసలు విషయం బయటపడింది.
తీరా అగస్టీన్ చెప్పిన అడ్రస్‌కు చేరుకున్న పోలీసులకు తాళం వేసిన ఇల్లు కంటపడింది. ఇంటి బయట ఎవరూ తారసపడకపోవడంతో వారికి సందేహం కలిగింది.చుట్టుపక్కల విచారించిన పోలీసులకు పొరుగునే ఉన్న ఇంట్లో మైఖేల్ చేసిన నిర్వాకం తెలిసింది. మాజీ సైనికుడిని ఆస్పత్రికి తరలించగా ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. తప్పతాగిన స్థితిలో ఉన్న మైఖేల్‌ను హత్యా నేరంపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.