
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని 100 మందిని నమ్మించి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్ టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతకు వల వేసింది ఓ ముఠా. రెయిన్‌బో టెక్నాలజీస్ పేరుతో దాదాపు వంద మందిని రిక్రూట్ మెంట్ చేసుకుంది. శిక్షణ ఇప్పించేందుకు డిపాజిట్ చేయాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.9వేల నుంచి 15 వేల వరకూ వసూలు చేసింది. సుమారు వంద మంది నుంచి 10లక్షల రూపాయలు వసూలు చేసింది. మూడు నెలలు గడిచినా నిర్వాహకులు ఏ ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో అనుమానం వచ్చి బాధితులంతా విశాఖ త్రీ టౌన్ పోలీసులను సంప్రదించారు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment