రైతు దంపతులు నందీశ్, కోమల మృతదేహాలు
సాక్షి, బెంగళూరు, మండ్య: ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారుతున్నా దశాబ్దాలుగా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు రైతులను ఆర్థికంగా కుంగదీస్తోంటే వారిని కష్టాల నుంచి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, పాలకులు యథాప్రకారం నిర్లక్ష్యం చేస్తూ ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. మండ్య జిల్లాలో ఓ రైతు ఏకంగా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాసిపెట్టి భార్యాబిడ్డలతో కలిసి పురుగుల మందు తాగి తనువు చాలించిన విషాదం సంభవించింది.
శుక్రవారం రాత్రి పొలంలోనే పురుగులు మందు తాగి ప్రాణాలు వదలగా, శనివారం ఉదయంఘోరం బయటపడింది. మృతులు నందీశ్ (40), ఆయన భార్య కోమల (32), పిల్లలు చందన (13), మనోజ్ (11). మేలుకోటె తాలూకా సుంకాతణ్ణూరు గ్రామంలో ఈ దారుణం జరిగింది. నందీశ్ బ్యాంకులు, వడ్డీ వ్యాపారులతో రూ.20 లక్షల వరకు వ్యవసాయం కోసం అప్పులు చేసినట్లు తెలిసింది. రెండుసార్లు సీఎంకు తన సమస్యలపై మొరపెట్టుకున్నా స్పందన దక్కలేదని సమాచారం.
నన్ను కలిసింది నిజమే: సీఎం
సాక్షి, బెంగళూరు: నందీశ్ కుటుంబ ఆత్మహత్యపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ ఇటీవల ఆ కుటుంబం తనను కలిసి సమస్యను తనకు వివరించిందని తెలిపారు. పరిష్కరిస్తానని, కొంత సమయం ఇవ్వాలని హామీ ఇచ్చానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment