స్టార్‌ హీరోయిన్‌ ఫిర్యాదు; నటుడిపై ఎఫ్‌ఐఆర్‌! | FIR Filed On Aditya Pancholi Over Molestation In Mumbai | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోయిన్‌ ఫిర్యాదు; నటుడిపై ఎఫ్‌ఐఆర్‌!

Published Thu, Jun 27 2019 7:08 PM | Last Updated on Thu, Jun 27 2019 7:35 PM

FIR Filed On Aditya Pancholi Over Molestation In Mumbai - Sakshi

ముంబై : పదేళ్ల క్రితం నాటి ఘటనలో బాలీవుడ్‌ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలిపై తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై ముంబై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆధారాలు సేకరించడం కాస్త కష్టమే అయినప్పటికీ లోతుగా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కెరీర్‌ తొలినాళ్లలో ఆదిత్య పంచోలీ తనను లైంగికంగా వేధించి, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ ఒకరు‌‌.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కూడా సదరు నటిపై పరువు నష్టం దావా వేశారు.

చదవండి : కంగనాపై నటుడి భార్య ఫైర్‌

కాగా తన భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆదిత్య పంచోలి భార్య, నటి జరీనా ఇటీవలే మీడియాతో మాట్లాడారు.  ‘ నా భర్త గురించి నాకంటే ఎవరూ బాగా అర్థంచేసుకోలేరు. తను నా దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు. గతంలో ఏం జరిగిందో.. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అన్ని విషయాల గురించి తెలుసు. తనెప్పటికీ తప్పు చేయడు. కొంతమంది ఆడవాళ్లు తమ రిలేషన్‌షిప్‌ ముగిసిన తర్వాత..భాగస్వామిపై నిందలు వేస్తారు. అకస్మాత్తుగా... అత్యాచారానికి గురయ్యామంటూ గగ్గోలు పెడతారు. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా తమతోనే ఉండాలనే భావనతోనే ఇలా చేస్తారు. ఇది సరైంది కాదు’ అని సదరు హీరోయిన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాంరటూ నటి తనూశ్రీ దత్తా.. బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. అయితే సాక్ష్యాధారాలు లేని కారణంగా ఇటీవలే పోలీసులు అతడికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement