ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. సెబ్రింగ్ నగరానికి చెందిన జావర్ అనే దుండగుడు సన్ ట్రస్ట్ బ్యాంక్‌లో కాల్పులకు తెగబడ్డాడు. జావర్ విచక్షనారహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతి చెందగా, చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ బ్యాంక్ రక్తపుమడుగులతో భయానకంగా మారింది. అనంతరం జావర్ పోలీసులకు ఫోన్ చేసి ఐదుగురిని చంపానని చెప్పి పరారయ్యాడు.
అనంతరం ముమ్మరంగా గాలింపులు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు జావర్‌ను అదుపులోకి తీసకొని విచారిస్తున్నారు. కాల్పులకు గల కారణాలను పోలీసులు అతడి నుంచి రాబడుతున్నారు. ఇక ఫ్లోరిడాలో వరుస కాల్పుల ఘటనలు జరగడం పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment