డీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద మృతి | krishna DSC Candidate Suspicious death in Prakasam | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థి అనుమానాస్పద మృతి

Published Sat, Dec 29 2018 12:52 PM | Last Updated on Sat, Dec 29 2018 12:52 PM

krishna DSC Candidate Suspicious death in Prakasam - Sakshi

వెంకటకృష్ణ మృతదేహం

అవనిగడ్డ(కృష్ణా జిల్లా): డీఎస్సీలో శిక్షణకు వచ్చిన ఓ అభ్యర్థి ఆకస్మికంగా మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన బూచిరాజు వెంకటకృష్ణ (22) రెండు నెలల క్రితం డీఎస్సీ శిక్షణ కోసం అవనిగడ్డ వచ్చాడు. ఓ కోచింగ్‌ సెంటర్‌లో 45 రోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. కోచింగ్‌ పూర్తి కావడంతో కొద్ది రోజులుగా స్థానికంగా కొంత మంది మిత్రులతో కలసి రూమ్‌ తీసుకుని ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఆపస్మారక స్థితిలోకి చేరుకోగా మిత్రులు వెంటనే స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సందీప్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement