మృతి చెందిన శ్రావణి
కృష్ణా, మైలవరం: స్థానిక రాజాపేటలో అనుమానాస్పద స్థితిలో మహిళ గురువారం మృతి చెందింది. పోలీసులు అందించిన వివరాలు.. తోట నాగరాజు, శ్రావణిలు అద్దె ఇంట్లో గత కొంత కాలంగా ఉంటున్నారు. నాగరాజు ఇబ్రహీంపట్నంలోని ఒక వైన్‌షాపులో పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు ఉన్నాడు. ఉదయం ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్ళిన కుమారుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగా తల్లి ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలా డుతూ కనిపించింది. వెంటనే కుమారుడు ఇంటి యజమానుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment