
తిరువొత్తియూరు: ప్రేమించి మోసం చేసి విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించిన ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసుస్టేషన్‌లో ప్రియురాలితో వివాహం జరిపించారు. వివరాలు.. చెన్నై అనకాపుత్తూరు లేబర్ పల్లి వీధికి చెందిన కవిత (23) మొలిచలూరు 7వ వీధి అగస్థీశ్వరర్ నగర్‌కు చెందిన మెనువేల్‌నే ఇన్నోసా (వెంకటేశ్) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది కాలంగా వెంకటేశ్ కవితను తప్పించుకు తిరుగుతుండడంతో ఆమె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
విచారణ చేపట్టిన పోలీసులు విదేశాలకు సిద్ధమవుతున్న వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కవిత అందంగా లేకపోవడంతో ఆమెను వదలించుకోవడానికి ప్రయత్నించినట్టు వెంకటేష్ తెలిపాడు. దీంతో అతడిని వదలిపెడితే విదేశాలకు పారిపోవచ్చని భావించిన పోలీసులు వారికి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు. వివాహానికి ఇద్దరు సమ్మతించడంతో పోలీసుల సమక్షంలో వెంకటేశ్, కవిత మెడలో తాళి కట్టాడు. ఇష్టపూర్వకంగానే తామిద్దరం పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు వారిద్దరి చేత రాతపూర్వకంగా ఓ నోట్‌ను పోలీసులు రాయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment