![UP Man Bites Off Wife's Nose Over Suspicion Of Affair - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/13/crime.jpg.webp?itok=EmND6Wqq)
లక్నో: అనుమానం విచక్షణను చంపేస్తుంది. ఆవేశం అనర్థాలకు దారి తీస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా, పల్హోరా గ్రామంలో సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. భార్య తనకు చెప్పకుండా ఊరు వెళ్లిందన్న అసహనంతో భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. ఊరునుంచి తిరిగి వచ్చిన భార్యపై ఆగ్రహంతో ఊగిపోతూ వాదనకు దిగాడు. ఏకంగా ఆమె ముక్కి కొరికి తీవ్రంగా గాయపర్చాడు.
వివరాల్లోకి వెళితే..అర్జున్, గీతా దంపతులు. గీత (32) ఐదు రోజుల క్రితం తన భర్త అర్జున్‌కు చెప్పకుండా బరేలీకి వెళ్లింది తన అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లావంటూ గీతను అర్జున్ నిలదీశాడు. అయితే ఆమె సమాధానమివ్వకపోవడంతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో రగిలిపోతూ గీతపై దాడి చేసి ముక్కును కొరికాడు. ఈ సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి, గీతను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు అర్జున్‌ను అరెస్ట్ చేసి, విచారణ కొనసాగిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి దినేశ్ త్రిపాఠి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment