
మోత్కూరు : నిద్ర పట్టడం లేదని మనోవేదనతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరులోలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన కొండకింది సోమిరెడ్డి (52) అలియాస్ థామస్‌రెడ్డి స్థానిక ఓ జువెల్లరి షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతను ఆరు నెలలుగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు.
ఉదయం భార్య జోనమ్మ, కుమారుడు జోసెఫ్‌రెడ్డి కూలి పనులకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సరికి తండ్రి విగతజీవిగా కనిపించాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్‌ఐ అంకిరెడ్డి యాదయ్య తెలిపారు.