అనాథ అని చేరదీస్తే... | Man Killed Old Woman in Karnataka | Sakshi
Sakshi News home page

అనాథ అని చేరదీస్తే...

Published Tue, Feb 5 2019 1:16 PM | Last Updated on Tue, Feb 5 2019 1:16 PM

Man Killed Old Woman in Karnataka - Sakshi

హత్యకు గురైన యల్లమ్మ (ఫైల్‌) వృద్ధురాలిని హత్య చేసిన హరీశ్‌ (ఫైల్‌)

బొమ్మనహళ్లి : అనాథగా తిరుగుతున్న యువకుడిని చేరదీసి అన్నం పెట్టిన పాపానికి చెడు అలవాట్లకు బానిసైన యువకుడు చేరదీసిన వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. వివరాలు... బొమ్మనహళ్లి పరిధిలోని రూపేన అగ్రహార ఎన్‌జీఆర్‌ లేఔట్‌లో యల్లమ్మ (80) అనే వృద్ధురాలు స్మశాసనంలో కాపలాగా ఉంటోంది. భర్త చనిపోవడంతో యల్లమ్మ రెండేళ్ల క్రితం హరీశ్‌ (19) అనే యువకుడిని చేరదీసింది. హరీశ్‌కు తల్లిదండ్రులు లేకపోవడంతో అతని అవ్వ దగ్గర పెరిగాడు.

చెడు అలవాట్లకు బానిసకావడంతో హరీశ్‌ను ఆమె దూరంగా ఉంచింది. దీంతో ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో హరీశ్‌ ఏమి చేయాలో తెలియక స్మశానం వద్దకు వచ్చేవాడు. దీంతో యల్లమ్మ అతనికి తరచూ అన్నం పెట్టి చేరదీసింది. ఈ క్రమంలో అతని బుద్ధి మారకపోగా స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడని యల్లమ్మ హరీశ్‌ను మందలించింది. దీంతో శనివారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో వచ్చిన హరీశ్‌ వృద్ధురాలిపై విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయారు. యలమ్మ గట్గిగా కేకలు వేయడంతో గొర్రెల కాపరులు అక్కడికి చేరుకుని చూడగా వృద్ధురాలు రక్తపు మడుగులో ఉంది. స్థానికుల సహకారంతో విక్టోరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు ఫిర్యాదు చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. వృద్ధురాలిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement