
సాక్షి, తిరుత్తణి (తమిళనాడు): ప్రియురాలి మెడను కోసి నగలు ఎత్తుకుపోయాడు ఓ దుర్మార్గుడు. ఈ కిరాతక ఘటన తమిళనాడులో జరిగింది. వివరాలివి..చెన్నై అంబత్తూరుకు సమీపం పట్రవాక్కంకు చెందిన లక్ష్మీ అలియాస్ రేవతి(42) భర్త రామచంద్రన్‌తో విభేదాల కారణంగా.. పదేళ్ల నుంచి తన ముగ్గురి పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. అదే సమయంలో తిరువళ్లూరు సమీపం వేపంపట్టుకు చెందిన మారి అలియాస్ మారియప్పన్(37) రేవతి ఇంటికి ఎదురుగా కిరాణా దుకాణం నడిపేవాడు.
ఈ సందర్భంగా రేవతి, మారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 10న రేవతి, మారి బైక్‌పై వాలాజాలోని ధన్వంతరి ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తిరువాలాంగాడు సమీపంలోని లక్ష్మీ విలాసపురం వద్ద ఆగారు. ఆ సమయంలో తాను వ్యాపారంలో నష్టపోయానని ఆదుకోవాలని మారి కోరగా సాయపడేందుకు రేవతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన మారి కత్తితో తలను కోసి మెడలోని ఆరు సవర్ల నగలు తీసుకుని తలను అక్కడికి సమీపంలోని చెరువుకట్ట ప్రాంతంలో వేసి పరారయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 14వన మారిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment