
సాక్షి, చెన్నై: తన వద్ద తీసుకున్న రూ.400ను తిరిగి ఇవ్వాలని అడిగిన యువకుడిని స్నేహితులే హత్య చేశారు. ఈ ఘటన సోమవారం పొంగలూర్ సమీపంలో జరిగింది. కెరుడముత్తూర్‌కి చెందిన తంగరాజ్ కుమారుడు నందకుమార్ (24) కూలి పనులు చేస్తుంటాడు. అదే ఊరికి చెందిన ఇతని స్నేహితులు విజయ్ (22), సుధాకర్ (20). నందకుమార్ వద్ద సుధాకర్ రూ. 400 అప్పు తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం ముగ్గురూ ఊరి సమీపంలో మద్యం సేవించడానికి వెళ్లారు.
ఆ సమయంలో నందకుమార్ తాను ఇచ్చిన రూ. 400లను అడిగాడు. ఈ క్రమంలో తగాదా ఏర్పడింది. ఆగ్రహించిన సుధాకర్, విజయ్ నందకుమార్‌పై దాడి చేశారు. రాయిపై పడడంతో నందకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కామనాయక్కన్ పాలైయమ్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment