సాక్షి, చెన్నై(టీ.నగర్): ప్రియుడికి కుమార్తెనిచ్చి వివాహం జరిపించిన తల్లి సహా నలుగురిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తమిళనాడులోని తేని సమీపం ఉత్తమపాళయం చిన్న ఓబులాపురం వినాయక ఆలయం వీధికి చెందిన మహిళ (38)కు అదే ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ (22)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను విడిచి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రియుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించినట్టయితే తమ సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని లత భావించింది. దీంతో తన 13 ఏళ్ల కుమార్తెను ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపేందుకు నిర్ణయించి, ఈనెల 20వ తేదీన రాజ్‌కుమార్‌తో బాలిక వివాహం జరిపించింది. దీనిపై బాలిక తండ్రి రాయప్పన్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజ్‌కుమార్, మహిళ సహా నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment