బిడ్డలను కడతేర్చి తల్లి ఆత్మహత్య | Mother Suicide After Murder Childrens | Sakshi
Sakshi News home page

బిడ్డలను కడతేర్చి తల్లి ఆత్మహత్య

Published Thu, Apr 5 2018 8:51 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

Mother Suicide After Murder Childrens - Sakshi

సంఘటన స్థలం వద్ద విచారణ చేస్తున్న పోలీసులు, అనాథలైన ఇద్దరు కుమార్తెలు

క్షణికావేశంలో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం పిల్లల్ని అనాథల్ని చేసింది. కుంటుంబ వ్యవహారంలో భర్త మందలించాడని మనస్తాపంతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి..తాను సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో పళంగానత్తంలో విషాదం నెలకొంది.

అన్నానగర్‌: కుటుంబకలహాలతో ఇద్దరు బిడ్డలను కడతేర్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మదురైలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. మదురై పళంగానత్తం గణపతినగర్, ఉత్తర వీధికి చెందిన మూర్తి కార్మికుడు. ఇతని భార్య ప్రియ (25). వీరికి నలుగురు పిల్లలు. భర్త సంపాదనతో కుటుంబం నడవడం కష్టంగా ఉండేది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ప్రియ తనకు తెలిసిన ఒకరికి వేరే వాళ్ల నుంచి అప్పు ఇప్పించింది. ఈ విషయం మూర్తికి తెలియడంతో భార్యని మంగళవారం మందలించాడు. అనంతరం పనికి వెళ్లాడు. ప్రియ పెద్ద కుమార్తెలు ఇద్దరు పాఠశాలకు వెళ్లారు. ఇంట్లో ప్రియ మూడో కుమార్తె మురుగేశ్వరి(04), కుమారుడు విజయగణేష్‌ (8నెలలు) ఉన్నారు.

భర్త మందలించాడని..
భర్త మందలించాడని మనస్తాపంతో ఉంది. ఈ స్థితిలో ఆమె ఇంట్లో ఉన్న ఇద్దరి పిల్లలకు విషం ఇచ్చి.. తానూ విషం తాగింది. మూర్తి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఈ సమాచారంతో దిలకర్‌దిడల్‌ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ వెట్రిసెల్వన్, సుబ్రమణ్యపురం సీఐ మలైస్వామి, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement