కాళ్లు, చేతులు కట్టేసి... | Murders In Kurnool | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణహత్య

Published Sat, Aug 4 2018 7:07 AM | Last Updated on Sat, Aug 4 2018 7:07 AM

Murders  In Kurnool - Sakshi

బావిలో తేలియాడుతున్న మృతదేహం  మహాదేవ పెళ్లినాటి ఫొటో(ఫైల్‌)

కోసిగి (కర్నూలు): మండలంలోని అగసనూరు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేసిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. ఉదయం అగసనూరు గ్రామానికి చెందిన వడ్డే చిన్నకర్రెప్ప పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో బావిలో వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారికి తెలపడంతో అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు.కోసిగి సీఐ దైవప్రసాద్, ఎస్‌ఐ అశోక్‌కుమార్‌  సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు.

మృతుడి షర్ట్‌ కాలర్‌పై  జీఎల్‌ఎస్‌ఆర్‌– పీఎంఆర్‌ రోడ్డు పేరుతో లేబుల్‌ లభ్యమైంది. ఇది కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ జిల్లా గిలకసూగురు(జీఎల్‌ఎస్‌ఆర్‌) గ్రామానికి చెందినది పోలీసులు గుర్తించారు. వెంటనే సదరు గ్రామంలో  విచారించగా మృతుడు గ్రామానికి చెందిన బోయ మహాదేవ(28)గా తేలింది. మహాదేవ బుధవారం స్నేహితులతో కలిసి మాధవరం వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. మృతుడికి భార్య నరసమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
హత్య చేసి బావిలో పడేసి.. 
బావి పరిసరాల్లో రక్తపు మరకలు, బండరాయికి రక్తం అంటి ఉండడం , వ్యక్తిని లాకెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. దీనికి తోడు మృతుడికి కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో మొదట బండరాయితో మోది హత్య చేసిన తర్వాత బావిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement