సాక్షి, నల్గొండ : జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో నిందితుడి కదలికలను పోలీసులు గుర్తించారు. హత్యకు కారకుడిగా భావిస్తున్న మారుతీ రావు తన వాహనంలో హైదరాబాద్ వైపుగా వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట మీదుగా వాహనం హైదరాబాద్‌కు బయలు దేరింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలను పోలీసులు సేకరించారు. ఈ మేరకు లోకల్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. టోల్ గేట్ దాటుతున్న నిందితుడి వాహనం .. ఈ వీడియోలో 👇 చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment