
మృతి చెందిన బెస్త శ్రీనివాసులు
వెల్దుర్తి: పట్టణ సమీపంలోని ఎన్‌హెచ్ 44పై కర్నూలు క్రాస్ వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న బెస్త శ్రీనివాసులు(45), చాకలి రంగస్వామి అలంపూర్ జోగులాంబ ఆలయానికి పల్సర్ బైక్‌పై బయలు దేరారు. రిటైర్డ్ ఎస్‌ఐ ఉమాపతి కర్నూలు వెళ్లేందుకు వెల్దుర్తి క్రాస్ వద్ద హైవేపైకి అకస్మాత్తుగా వచ్చాడు.
ఈక్రమంలో రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్నాయి. ఘటనలో బెస్త శ్రీనివాసులు, చాకలి రంగస్వామిలకు తీవ్ర గాయాలయ్యాయి. రిటైర్డ్ ఎస్‌ఐ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు వారిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో బెస్త శ్రీనివాసులు మరణించినట్లు కర్నూలు ఆసుపత్రి డాక్టర్లు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment