ఎర్ర స్మగ్లర్‌ అరెస్ట్‌ | Sandlewood Smuggler Arrest in Chittoor | Sakshi
Sakshi News home page

ఎర్ర స్మగ్లర్‌ అరెస్ట్‌

Published Fri, Nov 16 2018 1:00 PM | Last Updated on Fri, Nov 16 2018 1:00 PM

Sandlewood Smuggler Arrest in Chittoor - Sakshi

ఆయుధాలతో పాటు స్మగ్లర్‌

చిత్తూరు, చంద్రగిరి: శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రస్మగ్లర్‌ను అరెస్టు చేసినట్టు ఆర్‌ఎస్‌ఐ వాసు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రస్మగ్లర్లు అధిక సంఖ్యలో శేషాచలంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందిందన్నారు. తాను బృందంతో కలిసి గురువారం ఉదయం కూంబింగ్‌ చేపట్టామన్నారు. స్మగ్లర్ల అడుగు జాడలను బట్టి రెండు బృందాలుగా విడిపోయి కూంబింగ్‌ చేపట్టామని తెలిపారు. తమ రాకను పసిగట్టిన స్మగ్లర్లు ఒక్కసారిగా రాళ్లు, గొడ్డళ్లతో దాడికి యత్నించారని పేర్కొన్నారు. పీసీలు శీను, ముత్యాలు స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో గాలిలోకి ఒక రౌండ్‌ కాల్పులు జరపడంతో దుండగులు తలోదిక్కుకు పారిపోయేందుకు ప్రయత్నించారని వివరించారు. ఈ సమయంలో సేలం జిల్లాకు చెందిన సుబ్రమణిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఆయుధాలు, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement