స్వాధీనం చేసుకున్న తాబేళ్లు
భువనేశ్వర్ : రాష్ట్రం సరిహద్దులో తాబేళ్ల అక్రమ రవా ణా గుట్టు రట్టయింది. చాందీపూర్ అటవీ శాఖ పోలీసులు, బాలాసోర్ రైల్వే రక్షక దళం ఉమ్మడి ప్రయత్నంతో ఈ గుట్టు రట్టయింది. పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు ఈ తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం ఆధారంగా ఈ రెండు వర్గాలు ఆకస్మికంగా దాడి చేశా యి. రాజ్‌ఘాట్ రైల్వేస్టేషన్‌లో ఆకస్మికంగా దాడి చేపట్టారు.
ఈ దాడిలో 4 జాతుల 91 తాబేలు పిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల సందిగ్ధ కదలిక నేపథ్యంలో రైల్వే రక్షక దళం ఈ వర్గంపై దృష్టి సారించింది. పోలీసు దళాలు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పశ్చిమ బెంగాల్‌లోని బాలాసోర్ జిల్లా బొగొరాయి ప్రాంతీయుడుగా గుర్తించారు.
వీరిద్దరూ తరచూ ఇటువంటి అక్ర మ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచా రం అందినట్లు చాందీపూర్ అటవీ శాఖ పోలీసు లు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న 91 తాబేలు పిల్లల్ని సువర్ణరేఖ, సముద్ర సంగమం కేంద్రంలో విడిచి పెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment